About Peacock In Telugu Information Matter
నెమలి భారత దేశ జాతీయ పక్షి.
మన దేశం లో ఎన్నో జాతీయ భావాలు ఈ పక్షి తో ముడిపడి ఉన్నాయి.
ఇంగ్లీష్ లో నెమలి ని peacock అని అంటారు.ఆడ నెమలిని peahen అని అంటారు.
నెమలి చాల అందమైన పక్షి.
తొలకరి వర్షం కురుస్తున్నప్పుడు నెమలి పురి విప్పి నాట్యం ఆడుతుంది.
నెమలి పురి చాలా అందంగా ఉంటుంది.
నెమలి 25 సంవత్సరాలు బతుకుతుంది.
నెమలి పక్షి జాతికి చెందినది కాని బాగా ఎత్తులకు ఇవి ఎగరలేవు.
నెమలి చిన్న చ్నిన్న జంతువులని కీటకాలని తింటుంది.
నెమలి పించం ఆకు పచ్చ రంగులో నీలం రంగులో చాలా అందంగా ఉంటుంది.
మగ నెమలికి అందమైన పించం ఉంటుంది.ఈ పించం లో మెరిసే ఈకలు ఉంటాయి.
ఈ అందమైన పించం ఆడ నెమలి ఆకర్షిస్తుంది.
తెల్లటి రంగులో ఉండే పిచం గల నెమలి కూడా ఉంటుంది.
హిందూ దేవుడు శ్రీ కృష్ణుడు నెమలి పించాన్ని అలంకార ప్రాయంగా ధరిస్తాడు.
0 కామెంట్‌లు